Thursday, January 9, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్ లో భక్తులు వేచి చూడకుండా నేరుగా తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుంటున్నారు. ఇక, మంగళవారం శ్రీవారిని 62,566 మంది భక్తులు దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. మొత్తం 16,021 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ.3.2 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.

కాగా,జనవరి 13న ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి ఇవాళ ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి రథానికి మేళతాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News