Monday, December 23, 2024

బాసర అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

బాసర : హిందువుల తొలిపండుగ ఏకాదశిని పురస్కరించుకొని గురువారం భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బాసర గోదావరి నదిలో ఇంటిల్లిపాది పుణ్యస్నానాలు ఆచరించి జలాలను వెంట తీసుకెళ్లారు. గంగమ్మ తల్లికి భకుత్లు మొక్కులు చెల్లించారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు పూజలు జరిపారు. పుష్కర ఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం నుండే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటాలడింది. భక్తులు చిన్నారులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రద్వీకి అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News