Friday, December 27, 2024

మేడారంలో భక్తుల సందడి

- Advertisement -
- Advertisement -

తాడ్వాయి: వనదేవతల దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవుదినం కావడం తొలకరి పలకరింపు తర్వాత తమ వ్యవసాయంలో సంమృద్ది సాధించేలా చూడాలని, విద్యా సంవత్సరం మొదలు కావడంతో దూర ప్రాంతాల నుండి భక్తులు తల్లుల దర్శనానికి పిల్లా పాపలతో తరలివచ్చారు. తల్లులకు మొక్కులు చెల్లించుకొని తమ పిల్లల చదువులు సజావుగా సాగాలని ఆనందంగా ఉండేలా చూడాలని కోరుకున్నారు.

ఛత్తీస్‌గడ్ నుండి బిజెపి నాయకులు బస్తర్ మాజీ ఎంపి దినేష్ కశ్యప్ కుటుంబ సమేతంగా వనదేవతల దర్శనానికి మేడారం వచ్చారు. మొదట జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల్లుల గద్దెలకు చేరుకొని పూలు,కుంకుమ, బంగారం, కొత్త బట్టలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పూజారులు దినేష్ కశ్యప్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దినేశ్ కశ్యప్ మాట్లాడుతూ మొదటిసారి మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బస్తర్ నుండి గెలుపొందిన తర్వాత మరలా వచ్చి తల్లులను దర్శించుకుంటానని అందరిని చల్లగా చూడాలని కోరుకున్నట్లు చెప్పారు. దినేష్ కశ్యప్ దంపతుల వెంట గంగులూరుకు చెందిన సాద్వి వసుంధర లాటియా మేడారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛత్తీస్‌గడ్ బిజెపి నాయకులు చందు, సిద్దు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుండి కాక ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. వేలాది మంది భక్తుల రాకతో ఆదివారం నాడు మేడారం పరిసరాలు భక్తులతో జనసంద్రంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News