Saturday, December 21, 2024

శ్రీ లక్ష్మీనరసింహునికి నిత్య పూజలు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో స్వామి వారి దర్శనార్థం తరలి వచ్చిన భక్తుల రద్దీ పెరిగింది. శనివారం యాదాద్రి క్షేత్రానికి విచ్చేసిన భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు పట్టణ కేంద్రంలో సందడి నెలకొంది. తెల్లవారుజామున 3:30 గంటలకు ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత, అర్చన, అభిషేక పూజలను నిర్వహించగా భక్తులు తెల్లవారుజాము నుండే స్వామి వారి దర్శనంతో పాటు ఆలయంలో నిర్వహించు నిత్య పూజలలో పాల్గొని దర్శించుకున్నారు.

Crowd of devotees in Yadadri temple

శ్రీవారి నిత్య కల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, కుంకుమార్చన, వెండి జోడు సేవ తదితర పూజల కార్యక్రమాలలో భక్తులు పాల్గొని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. యాదాద్రి కొండపైన కొలువుదీరిన శ్రీ పర్వత వర్ధీణీ రామలింగేశ్వర స్వామి వారి శివాలయంలో భక్తులు శివదర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండక్రింద శ్రీ పాతలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాన్ని భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని ఆలయ నిత్య పూజలలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శన క్యూలైన్లు, ప్రసాద విక్రయ క్యూ లైన్లు, ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు తదితర ప్రాంతాలలో భక్తులతో సందడిగా కనిపించింది.

నిత్యరాబడి…

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా శనివారం రోజున 32 లక్షల 44 వేల 290 రూపాయలు అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News