యాదాద్రి భువనగిరి:శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తగ్గిన భక్తుల రద్దీ శనివారం పెరిగింది. విద్యాసంస్థలకు సెలవు లు, వర్షం తగ్గుముఖం పట్టడంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం భక్తులు పిల్లాపాపలతో కలిసి వ స్తున్నారు. భక్తులు శ్రీవారి ఆలయ నిత్యపూజలలో పాల్గొని తమ మో క్కుబడులను చెల్లించుకున్నారు.
శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయం తెరిచిన ఆర్చకులు సుప్రభాత సేవతో ఆలయ పూజలకు శ్రీకారం చుట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనంతోపాటు ఆలయంలో జరిగిన నిత్యపూజలు అభిషేకం, అర్చన, సు దర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, వె ండి జోడిసేవ, దర్బార్ సేవతో పాటు శ్రీసత్యనారాయణ స్వామి వా రి వ్రతపూజలలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. కొండపైన కొ లువుదీరిని శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో శి వ దర్శనముతో పాటు, కొండకింద శ్రీపాతలక్ష్మీనరసింహుని భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శనివారం రూ.12,66,992 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.4,55,230, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,09,200, బ్రేక్ దర్శనం ద్వారా రూ.9 5,400, వ్రత పరూజల ద్వారా రూ.58,400, కొండపైకి వాహ న ప్రవేశం ద్వారా రూ.2,00,000తో పాటు పాతగుట్ట, శివాలయం ఇ తర శాఖల నుండి ఆలయ నిత్యరాబడి సమకురినట్లు ఆలయ అధికారులు తెలిపారు.