Monday, April 7, 2025

శృతి మించిన ఆకతాయిలు.. నటి శ్రీలీలకు చేదు అనుభవం

- Advertisement -
- Advertisement -

హీరోయిన్‌గా పరిచయమైన అనతి కాలంలోనే స్టార్ స్టేటస్‌ని సంపాదించుకున్న నటి శ్రీలీల. బాలీవుడ్‌లో ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో ఈమెకు చేదు అనుభవం ఎదురైంది. అయితే సినిమా షూట్ ముగించుకొని కార్తీక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల రోడ్డు మీద సమయంలో కొందరు ఆకతాయిలు శృతి మించి ప్రవర్తించారు. ఆమె చేయి పట్టుకొని బలవంతంగా లాగే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన బౌన్సర్లు ఆమెను వెనక్కి లాగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.

శ్రీలల ఈ మధ్యే రాబిన్‌హుడ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ఆశించినంత విజం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆమె అనురాగ్ బసు సినిమాతో పాటు తెలుగులో ‘మాస్ జాతర’.. తమిళ్‌లో పరాశక్తి అనే సినిమాల్లో నటిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News