డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉన్న దృష్టా హరిద్వార్ కుంభమేళాలో మంగళవారం చివరి షాహీద్ స్నాన్ సాంప్రదాయ పద్ధతిలో నిరాడంబరంగా జరిగింది. ఉదయం 10.45 వరకు దాదాపు 670 మంది సాధువులు పవిత్ర గంగానదిలో కుంభమేళా ముగింపు సందర్భంగా చివరి స్నానమాచరించారు. గంగానది ఒడ్డున ఉన్న హర్ కి పైరి వద్ద జరిగిన ఈ షాహీద్ స్నాన్‌లో మరికొందరు సాధువులు ఆ తర్వాత పాల్గొన్నారు. దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న కారణంగా కుంభమేళాలో మిగిలిన క్రతువును సూచనప్రాయంగా నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 17న సాధువులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనికి వివిధ అఖాడాలు కూడా అంగీకరించి గత వారంలోనే తమ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నిష్క్రమించడం ప్రారంభించాయి. దీంతో కుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్ 30న లాంఛనంగా ముగిసే కుంభమేళా జరుగుతున్న ఘాట్ల వద్ద మంగళవారం జన సంచారం కనపడలేదు.
Crowds gather for last ‘Shahi Snan’ in Haridwar