Friday, April 4, 2025

బంగ్లాదేశ్ కాళీ గుడిలో కిరీటం మాయం

- Advertisement -
- Advertisement -

తన పర్యటన సందర్శంగా 2021లో బంగ్లాదేశ్‌లోని ప్రఖ్యాత జేషోరేశ్వరీ కాళీ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా సమర్పించిన విలువైన ఆభరణం చోరీకి గురికావడం పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. చోరీ ఘటనపై దర్యాప్తు జరిపించాలని బంగ్లాదేశ్ పాలకులను భారత్ కోరింది. ప్రధాని నరేంద్ర మోడీ కాళీ మాతకు సమర్పించిన కిరీటం చోరీకి గురికావడం పట్ల ఢాకాలోని భారత హై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఆభరణాన్ని స్వాధీనం చేసుకుని నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా హైకమిషన్ కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News