Sunday, December 22, 2024

సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

దంతేవాడ (ఛత్తీస్‌గఢ్): దంతేవాడ జిల్లాలో సిఆర్‌పిఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం రాత్రి కానిస్టేబుల్ గునిన్‌దాస్ తనకు తానే సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని రాయిపూర్‌కు 400 కిమీ దూరంలో బర్సూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో సిఆర్‌పిఎఫ్ 195 బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ సంఘటన జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. వెంటనే మొదట యూనిట్ ఆస్పత్రికి, తరువాత జిల్లా ఆస్పత్రికి తరలించార.

అక్కడ నుంచి రాయిపూర్‌కు విమానం ద్వారా తరలించి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. అస్సాంకు చెందిన దాస్ శెలవులో వెళ్లి తిరిగివచ్చిన తరువాత డ్యూటీలో జాయిన్ అయ్యాడని పోలీస్ అధికారులు తెలిపారు. సంఘటన ప్రదేశం వద్ద ఆత్మహత్య నోట్ ఏదీ లేదని, ఎందుకు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందో తెలుసుకోడానికి దర్యాప్తు ప్రారంభిస్తున్నామని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News