Monday, December 23, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సిఆర్‌పిఎఫ్ జవాన్ వెపన్ చోరీ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఇన్‌సాస్ వెపన్ చోరీ సంఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కలకలం సృష్టించింది. ఫిర్యాదు అందుకున్న ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి పోలీసులు గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్టు చేసి వెపన్, రౌండ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…సిర్‌పిఎఫ్‌లో చాంద్రాయణగుట్ట బెటాలియన్‌లో సిద్ధార్థ సింగ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన కానిస్టేబుల్ 10వ నంబర్ ఫ్లాట్ ఫాంలో ఇన్‌సాస్ వెపన్, 60లోడ్ రౌండ్లు, మూడు మ్యాగ్జిన్లు ఉన్న బ్యాక్‌ప్యాక్‌ను పెట్టాడు. దానిని ఫ్లాట్ ఫాంపై పెట్టి కొద్ది సేపటి తర్వాత చూశాడు. అక్కడ వెపన్‌కు సంబంధించిన బ్యాక్‌ప్యాక్ కన్పించలేదు. వెంటనే సిద్ధార్థ సింగ్ జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తుపాకీని పట్టుకునేందుకు ఎనిమిది టీములను ఏర్పాటు చేశారు. సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించగా ఓ వ్యక్తి బ్యాక్‌ప్యాక్‌ను తీసుకుని వెళ్తున్న విషయం గమనించారు. మరింత పరిశీలించగా నక్కేని ఆనంద మూర్తిగా గుర్తించారు. బ్యాక్‌ప్యాక్‌ను తీసుకుని వెళ్లిన నిందితుడు దానిని గాంధీనగర్ మెట్రో స్టేషన్ వద్ద వదిలినట్లు చెప్పాడు. అక్కడికి వెళ్లి పరిశీలించగా బ్యాక్‌ప్యాక్‌ను ఓ వృద్ధుడు రాచమల్ల సత్యనారాయణ(65) బ్యాగును తీసుకుని బోలక్‌పూర్ వైపు వెళ్లినట్లు గమనించారు. 100 సిసిటివిలను పరిశీలించన పోలీసులు వృద్దుడు ఉంటున్న ఇంటిని తెలుసుకుని బ్యాక్‌ప్యాక్‌ను తిరిగి సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌కు అప్పగించారు. వెపన్‌ను వెతికి పట్టుకున్న జిఆర్‌పి డిసిపి సలీమా, పోలీసులను తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News