Saturday, December 21, 2024

15 మంది శివసేన ఎమ్మెల్యేలకు వై- ప్లస్ సిఆర్ పిఎఫ్ రక్షణ

- Advertisement -
- Advertisement -

 CRPF cover to 15 rebel Shiv Sena MLAs

న్యూఢిల్లీ: కనీసం 15 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సిఆర్‌పిఎఫ్ కమాండోల వై-ప్లస్ భద్రతను కేంద్రం ఆదివారం పొడిగించినట్లు అధికారులు తెలిపారు. భద్రత కల్పించిన వారిలో రమేష్ బోర్నారే, మంగేష్ కుడాల్కర్, సంజయ్ శిర్సత్, లతాబాయి సోనావానే, ప్రకాస్ సర్వే , మరో 10 మంది ఉన్నారు. మహారాష్ట్రలో నివసిస్తున్న వారి కుటుంబాలకు కూడా భద్రత ఉంటుందని వారు తెలిపారు.దాదాపు నాలుగు నుంచి ఐదుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలు, షిఫ్టుల వారీగా, ప్రతి ఎమ్మెల్యే మహారాష్ట్రకు వచ్చిన తర్వాత వారికి భద్రత కల్పిస్తారని వారు తెలిపారు.

శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు  మంత్రి ఏక్‌నాథ్ షిండేకు తమ తమ విధేయతను చూపుతున్నారు. ప్రస్తుతం వారంతా గౌహతిలో ఉన్నారు. పైగా  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టారు. రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు పార్టీ జాతీయ కార్యవర్గం ఉద్ధవ్ ఠాక్రేకు అధికారం ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News