Sunday, December 22, 2024

లైంగిక వేధింపులకు పాల్పడిన సిఆర్‌పిఎఫ్ డిఐజి డిస్మిస్

- Advertisement -
- Advertisement -

లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక ఉన్నతాధికారిని విధుల నుంచి తప్పిస్తూ సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సిఆర్‌పిఎఫ్) ఉత్తర్వులు జారీచేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) సిఫార్సుపై కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆమోదం మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన చీఫ్ స్పోర్ట్ ఆఫీసర్ ఖజన్ సింగ్ మహిళా సిబ్బందిని లైంగికంగా వేధిస్తున్నట్లు రుజువు కావడంతో ఆయనను విధుల నుంచి తొలగిస్తూ సిఆర్‌పిఎఫ్ ఉత్తర్వులు జారీచేసింది. ఖజన్ సింగ్ డిప్యుటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డిఐజి) ర్యాంకులో ఉన్నారని వర్గాలు తెలిపాయి.

సిఆర్‌పిఎఫ్‌కు చెందిన కొందరు మహిళా సిబ్బంది చేసిన లైంగిక వేధఙంపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపిన సిఆర్‌పిఎఫ్ ఖజన్ సింగ్ దోషి అని తేల్చింది. దేశంలోనే అతి పెద్ద అనుబంధ సైనిక దళమైన సిఆర్‌పిఎఫ్ తన దర్యాప్తు నివేదికను యుపిఎస్‌సికి సమర్పించింది. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ ఆయన ఉద్వాసనకు అనుమతించింది. సిఆర్‌పిఎఫ్ చీఫ్ స్పోర్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు ఖజన్ సింగ్ 1996 సియోల్ ఏషియన్ గేమ్స్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 200 మీటర్ల బటర్‌ఫై ఈవెంట్‌లో రజత పతకాన్ని కూడా ఆయన సాధించారు. ప్రస్తుతం ముంబైలో పనిచేస్తున్న ఖజన్ సింగ్‌కు డిస్మిసల్ ఉత్తర్వులకు సమాధానం ఇవ్వడానికి 15 రోజుల వ్యవధిని ఇచ్చినట్లు వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News