రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) బలగాలు జాతీయ జెండాలను పంచిపెట్టాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న బస్తర్‌ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో మువ్వన్నెల పతాకాలను పంచారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా జాతీయజెండాలను గ్రామప్రజలకు అందజేశామని సిఆర్‌పిఎఫ్ తెలిపారు. మావోయిస్టుల బెదిరింపులు తదితర కారణాల వల్ల సాతంత్య్రం వచ్చిన తరువాత ఒక్కసారి కూడా జాతీయజెండాను ఎగురవేయని గ్రామాల్లో సైతం తాము పతాకాలను పంపిణీ గ్రామీణులుకు వారి నివాసాల వద్ద జాతీయ పతాకాలను ఎగురవేయాలని తెలపడమేకాకుండా స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యాన్ని వారికి తెలియజేశామని అధికారులు వివరించారు. వామపక్ష తీవ్రవాదం నడుమ జీవిస్తున్న ప్రజలతో సత్సంబంధాలు పెరిగేందుకు బలగాలకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. 38బెటాలియన్ల సిఆర్‌పిఎఫ్ బలగాలను ఒక్కో బెటాలియన్‌లో సుమారు వెయ్యిమంది సిబ్బంది ఉంటారు. దంతేవాడ, బీజాపూర్, బస్తర్, సుకుమా జిల్లాల్లో వారంరోజుల వ్యవధిలో లక్ష జాతీయజెండాలను మారుమూల గ్రామాల్లో పంచామని ఛత్తీస్‌గఢ్ సెక్టార్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (సిఆర్‌పిఎఫ్) సాకేత్‌కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. స్వాత్రంత్ర దినోత్సవాన్ని, రిపబ్లిక్ డేను మావోయిస్టులు బాయ్‌కాట్ చేస్తుండటంతో ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యమిచ్చి జాతీయపతాకాలను అందించామని ఐజి వెల్లడించారు.
జాతీయ జెండాలను పంచిన సిఆర్‌పిఎఫ్ బలగాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -