Sunday, February 23, 2025

సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని సిఆర్‌పిఎఫ్ జవాన్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, గదిరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఆర్‌పిఎఫ్ జవాన్ ఒకరు శనివారం ఉదయం తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితమే సెలవు పెట్టి తిరిగి విధుల్లోకి వచ్చాడు. అయితే, అతని ఆత్మహత్యకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..సిఆర్‌పిఎఫ్ 226 బెటాలియన్‌కు చెందిన సైనికుడు విపుల్ భుయాన్ అస్సాంకు చెందినవాడు. అతను గదిరాస్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్నాడు.

శనివారం ఉదయం శిబిరంలోని బాత్రూమ్‌లోకి వెళ్లి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుల్లెట్ శబ్ధం విని సహచర సైనికులు వెళ్లి చూసేసరికి అప్పటికే మరణించాడు. సెలవుల నుంచి శిబిరానికి తిరిగి వచ్చినప్పటి నుంచి జవాన్ మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సైనికుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, 20 రోజుల్లో రాష్ట్రంలో ఐదుగురు సైనికులు కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వారిలో నలుగురు చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News