చాంద్రాయణగుట్ట: రక్తదాన శిబిరాల నిర్వహణలో సీఆర్‌పీఎఫ్ ఎళ్లవేళలా ముం దుంటుందని సిఆర్‌పీఎఫ్ సౌత్‌జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) రవిదీప్‌సింగ్‌సాహి అన్నారు. రక్తదానం చేయటం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట, హైదరాబాద్ సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లోని కాంపోజిట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నారాయణగూడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్టివ్ మెడిసిన్ (ఐపీఎం) పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (పీహెచ్‌ఎ), సెంట్రల్ బ్లడ్ సెంటర్ సౌజన్యంతో మంగళవారం ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాహి మాట్లాడుతూ రక్తదానం మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
దేశంలోని ఎల్‌డబ్లూ, కాశ్మీర్, నార్త్‌ఈస్ట్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లకు రక్తదానం విలువ తెలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇష్టపూర్వకంగా ముం దుకు వచ్చి, రక్తాన్ని దానం చేసి ఇతరుల విలువైన ప్రాణాలను కాపాడాలని కో రారు. గ్రూప్ సెంటర్ డీఐజీపీ బిల్లా ఉదయ భాస్కర్ మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తంతో ముగ్గురికి ప్రాణదానం చేయవచ్చన్నారు. సమాజంలో ఎంతో మందికి రక్త ఉత్పత్తుల అవసరం ఎంతో ఉందన్నారు. యేడాదిలో నాల్గు సార్లు రక్తదానం చేసే అవకాశం ఉన్నా ఒక్కసారైన రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని కోరారు. నేటి సమాజంలో రక్త అవసరం ఎం తో ఉందన్నారు. ప్రపంచంలో వైద్యరంగం ఎంతో అభివృద్ధి సాధించినా రక్తాన్ని తయ్యారు చేసే అవకాశం లేదన్నారు. రక్తదాతలను ప్రొత్సహించి రక్తదానం వల్ల ఉన్న అనుమానాలను, అపోహలను నివృత్తి చేయాలని సూచించారు.
20 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వరకు వయసు గల ఆరోగ్యవంతులు రక్తాన్ని దానం చేయాలన్నారు. రక్తదానంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఎల్లప్పుడు ముందున్నందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. కాంపోజిట్ హాస్పిటల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (మెడికల్) మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్.సి.లింగరాజ్ మాట్లాడుతూ కులం, మతం, జాతి అన్న భావన లేకుండా సీఆర్‌పీఎఫ్ దేశం, అంతర్జాతీయ సమాజంతో సంబంధం కలిగి ఉందన్నారు. ఇదే పద్దతని ము న్నుందు మానవసేవ కోసం కొనసాగిస్తామన్నారు. ఈ శిబిరంలో సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు, వంద మంది జవాన్లు రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్లడ్ సెంటర్ డిప్యూటీ డైరక్టర్ విజయశాంతి, సీఆర్‌పీఎఫ్ అధికారులు, జ వాన్లు పాల్గొన్నారు.