Wednesday, January 22, 2025

జెకె కథువాలో ఒక టెర్రరిస్ట్, సిఆర్‌పిఎఫ్ జవాన్ హతం

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలోని ఒక సరిహద్దు గ్రామంలో ఒక ఇంటిలో దాక్కున్న ఒక టెర్రరిస్టును15 గంటలకు పైగా కాల్పుల పోరు అనంతరం బుధవారం భద్రత బలగాలు హతమార్చాయని, ఆపోరులో అతని సహచరుడు కూడా మరణించాడని, ఒక సిఆర్‌పిఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడని అధికారులు వెల్లడించారు. సైదా సుఖల్ గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులను గమనించిన తరువాత మంగళవారం రాత్రి ప్రారంభమైన కాల్పుల పోరులో ఇద్దరు సీనియర్ అధికారులు గాయపడకుండా తప్పించుకున్నారని, అయితే, వారి వాహనాలకు తూటాలు తగిలాయని అధికారులు తెలిపారు.

దోడా జిల్లాలో భదేర్వాహ్, పఠాన్‌కోట్ రోడ్డుపై చాటర్‌గల్లా ఎగువ ప్రాంతంలో ఒక ఉమ్మడి చెక్‌పోస్ట్ వద్ద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్‌ఆర్) ట్రూపర్లు, ఒక ప్రత్యేక పోలీస్‌అధికారి (ఎస్‌పిఒ) గాయపడ్డారు. ఉగ్రవాదుల ఆచూకీ తీయడానికి ఎన్‌కౌంటర్ జరుగుతున్నప్పుడు రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్‌లోప్రశాంత వాతావరణాన్ని దెబ్బ తీయడానికి పాకిస్తాన్ సాగిస్తున్న ప్రయత్నాలు జమ్మూ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు పెచ్చుమీరడానికి కారణమని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News