Sunday, February 2, 2025

విధులు నిర్వహిస్తూ సిఆర్‌పిఎఫ్ జవాన్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: సిఆర్‌పిఎఫ్ జవాన్ విధులు నిర్వహిస్తూ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బర్గడ్ జిల్లా జగదల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రసన్నజిత్ పాల్ అనే సిఆర్‌పిఎఫ్ జవాన్ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పద్మపూర్ ప్రాంతంలో టవర్‌పై నిల్చొని విధులు నిర్వహిస్తున్నాడు. చలనం లేకుండా అతడు పడిపోవడంతో తోటి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. తన దగ్గర ఉన్న గన్‌తో అతడు కాల్చుకొని చనిపోయాడని ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పద్మాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అసలు పాల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో వివరాలు తెలియాల్సి ఉంది. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని పోలీసులు పేర్కొన్నారు. అతడి ఆత్మహత్య వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది. అతడి ఫోన్ కాల్ హిస్టరీతో పాటు పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News