Thursday, January 23, 2025

హిందీరాని వారు సర్కారీ కొలువులకు అనర్హులా?

- Advertisement -
- Advertisement -

చెన్నై : సిఆర్‌పిఎఫ్ రిక్రూట్‌మెంట్ల పరీక్షలలో తమిళం, ఇతర ప్రాంతీయ భాషలను మిళితం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఓ లేఖ పంపించారు. సిఆర్‌పిఎఫ్ పరీక్షల కంప్యూటర్ టెస్టును కేవలం ఇంగ్లీషు లేదా హిందీలలోనే రాయాల్సి ఉంటుందని పేర్కొనడం, ప్రాంతీయ భాషలలో పరీక్షలకు వీలు కల్పించకపోవడం దారుణమని స్టాలిన్ విమర్శించారు. ఇది ఏకపక్ష నిర్ణయం, పైగా వివక్షభరితం అని లేఖలో పేర్కొన్నారు. సొంత భాషలో పరీక్షలు రాయలేని స్థితిలో ఉండటం వేలాది మంది అభ్యర్థులకు పిడుగుపాటు అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

పైగా హిందీ అవగావహన ఉంటే వంద మార్కులలో పాతిక మార్కుల అవకాశం కల్పించడం కేవలం హిందీ మాట్లాడే వారికే ప్రయోజనం కల్గిస్తుందని, దక్షిణాదిలోని పలు ప్రాంతీయ భాష విద్యార్థులకు దీనితో తక్కు వ మార్కులు వస్తాయని, దీని గురించి కేంద్రం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఆదివారం అందించిన గణాంకాల మేరకు చూస్తే సిఆర్‌పిఎఫ్‌లో మొత్తం మీద 9212 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండగా ఇందులో తమిళనాడు నుంచి 579 పో స్టులకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ పరీక్ష రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో జరుగుతుంది. పరీక్షలు కేవలం ఆంగ్లంలేదా హిందీలలోనే రాయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొనడంతో మాతృభాషలో పరీక్ష రాయడానికి వీల్లేని పరిస్థితి ఇక్కడి తమిళయువతకు ఏర్పడిందని స్టాలిన్ తెలిపారు.

ఈ విధంగా చూస్తే హిందీ రాని వారు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారనే తీరులో కేంద్ర ప్రభుత్వ ధోరణి ఉందని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల రాజ్యాంగపరమై న హక్కులకు ఈ నోటిఫికేషన్ విఘాతంగా మారిందని, యువత ఉద్యోగావకాశాలపై పిడుగుపాటు అవుతోందని నిరసన వ్యక్తం చేశా రు. అభ్యర్థులు ఈ పరీక్షలను తమతమ ప్రాంతీయ భాషలలో రాసేందుకు వీలు కల్పించాల్సి ఉంది. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షా తక్షణం తగు చొరవ తీసుకుని తీరాలని తమ లేఖలో స్టాలిన్ డిమాం డ్ చేశారు. సంబంధిత విషయంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి కెటి రామారావు కూడా ఇటీవలే ఘాటైన లేఖ పంపించారు.

సిఆర్‌పిఎఫ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు దేశవ్యాప్తంగా 1 జులై నుంచి 13 జులై వరకూ జరుగుతాయి. యువత ఈ పరీక్షల కోసం విశేషరీతిలో కృషి సాగిస్తూ వస్తున్నారు. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ ప్రక్రియలోనే ఈ పరీక్షలు జరుగుతాయి. జాతీయ స్థాయిలో ఎక్కడైనా ఉద్యోగాల నియామకాలకు వీలైనప్పుడు సార్వత్రిక ఉద్యోగాలు అయినప్పుడు ప్రాంతీయ భాషలను పక్కనపెట్టే పద్ధతి ఎందుకు అని పలు దక్షిణాది రాష్ట్రాల నుంచి నిరసన ఉధృతం అవుతోంది. హిందీ ఆంగ్లాన్ని తాము కాదనడం లేదని, ఈ భాషలల్లో పరీక్షలు రాయనిస్తూనే ప్రాంతీయ భాషలలో కూడా పరీక్షలకు వీలు కల్పించడం న్యాయమని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News