Friday, December 20, 2024

మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి..

- Advertisement -
- Advertisement -

మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి చెందిన విషాద ఘటన ఛత్తీస్ గడ్ లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సుక్మా జిల్లా బెద్రెలోని వారాంతపు సంతలో జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఆర్పీఎఫ్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి మృతి చెందగా.. మరో జవానుకు గాయపడ్డారు.

అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడి చేయడంతో.. మావోలు పరారయ్యారు. గాయపడిన జవాన్ ను చికిత్స కోసం బెద్రెలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగంలోకి దిగిన కోబ్రా, సీఆర్పీఎఫ్ దళాలు మావోలను పట్టుకునేందుకు బెద్రె పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News