- Advertisement -
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామాలో గంగూ చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం యాపిల్ తోటల నుంచి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెకర్ వినోద్‌కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన వినోద్‌కుమార్ సమీపాన ఆస్పత్రికి తరలించగా, చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ దాడి తరువాత ఆ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఇదే విధంగా మంగళవారం శ్రీనగర్ లోని లాల్‌బజార్ చెక్‌పోస్ట్ దగ్గర అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ముస్తాక్ అహ్మద్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందగా, మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ఐదు రోజులకు మళ్లీ ఇదే విధమైన సంఘటన ఆదివారం జరిగింది.
CRPF SI Shot dead by Terrorists in Pulwama
- Advertisement -