Sunday, December 22, 2024

కేంద్ర బలగాల ఆధీనంలోకి నాగార్జున సాగర్ డ్యామ్..

- Advertisement -
- Advertisement -

నాగార్జున సాగర్‌ డ్యామ్ ను సీఆర్పీఎఫ్ బలగాలు అధీనంలోకి తీసుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి సాగర్ డామ్ వద్దకు చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు.. ఒక్కో పాయింట్ ను ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. దీంతో తెలంగాణ పోలీసులు డ్యామ్ వద్ద నుంచి వెనుదిరిగి వస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు డ్యామ్ మెత్తాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి. డ్యమ్ 13వ గేటు వద్ద ఎపి పోలీసులు ఏర్పాటు చేసిన కంచెను కూడా తొలగించనున్నారు. ప్రస్తుతం సాగర్ డ్యామ్ నుంచి కుడి కాల్వకు నీటి విడుదల కొనసాగుతోంది. నవంబర్ 30వ తేదీ గురువారం నుంచి సాగర్ కుడి కాల్వ ద్వారా ఇప్పటివరకు 5,450 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

కాగా, నిన్న(శుక్రవారం) సాయంత్రం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాట్లాడారు. కేంద్ర బలగాలు నాగార్జున సాగర్ డ్యామ్ ను అధీనంలోకి తీసుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలపడంతో అర్ధరాత్రి నుంచే సీఆర్పీఎఫ్ బలగాల డ్యామ్ వద్దకు చేరుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News