Monday, December 23, 2024

కాంచన్‌జంగ ప్రమాదంపై సిఆర్‌ఎస్ దర్యాప్తు:రైల్వే మంత్రి వైష్ణవ్

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లోని రంగపానిలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదానికి కారణాలపై రైల్వే భద్రత కమిషనర్ (సిఆర్‌ఎస్) దర్యాప్తు ప్రారంభించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రంగపాని స్టేషన్‌లో కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను ఒక గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొన్న సంగతి విదితమే. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించేందుకు చర్యలు తీసుకోగలమని మంత్రి తెలిపారు.

తక్కిన దేశంతో ఈశాన్య భారతాన్ని అనుసంధానించే ఈ కీలక మార్గంలో రైలు సర్వీసుల పునరుద్ధరణకు రైల్వేలు అగ్ర ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన ఉద్ఘాటించారు. సిలిగురిలోని న్యూ జల్పాయిగురి స్టేషన్ సమీపంలోని రంగపానిలో ప్రమాద స్థలంలో విలేకరులతో వైష్ణవ్ మాట్లాడుతూ, ‘ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్ సమగ్ర దర్యాప్తు జరుపుతారు’ అని చెప్పారు. రక్షణ, సహాయ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని మంత్రి ధ్రువీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News