Sunday, January 19, 2025

సిఆర్‌టి పోస్టులు గిరిజన అభ్యర్థులతోనే భర్తిచేయాలి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్

హైదరాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సిఆర్‌టి ) పోస్టులను గిరిజన అభ్యర్థుల నుంచే భర్తీ చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సిఆర్‌టి పోస్టుల భర్తీ కి అభ్యర్థు నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో గిరిజన సంఘం ఈ మేరకు డిమాండ్ చేసింది. ఈ పోస్టుల్లో స్థానిక గిరిజన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి భర్తీ చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చినా జిల్లా అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మానాయక్, ఆర్.శ్రీరామ్ నాయక్‌లు విమర్శించారు.

నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు చాలా జిల్లాలో పూర్తి విరుద్దంగా భర్తీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తక్షణ సిఆర్‌టి పోస్టులన్నీ గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో మొదటి ప్రాధాన్యత స్థానిక గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉందని, కానీ వివిధ జిల్లాలో అందుకు పూర్తి విరుద్ధంగా నియామకాలు చేపడుతున్నారని తెలిపారు. దీనివల్ల అర్హత కలిగిన గిరిజన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రాంతంలో సైతం ఓపెన్ రోస్టర్ విధానంతో నోటిఫికేషన్ ఇవ్వడం షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న రాజ్యాంగ హక్కులకు పూర్తి భిన్నమని వారన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో 15 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయని వాటిలో 9 ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఎఎన్‌ఎం పోస్టులు కూడా ఉన్నాయన్నారు. సిఆర్‌టి పోస్టులను గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. గిరిజన అభ్యర్థులు లేనిచోట్ల గిరిజనేతురులతో రోస్టర్ విధానంలో భర్తీ చేయాలని సర్కులర్ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. గిరిజన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి భర్తీ చేయకపోతే డిటిడిఓ కార్యాలయాన్ని దిగ్బందనం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News