న్యూఢిల్లీ: సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైనాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సహకారం అంశం ప్రధాన చర్చనీయాంశంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీ పొలిట్ బ్యూరో రెండు వర్గాలుగా విడిపోయినట్టు తెలుస్తోంది. ఒక వర్గం సిపిఎం నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి బిజెపికి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తుండగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన నేతలు మాత్రం అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ లేకుండా ఎలాంటి కూటమిని ఏర్పాటు చేయడం ఆచరణ యోగ్యం కాదని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. దేశంలోని పరిస్థితికి, రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయాలకు తేడా ఉందని కూడా ఆ వర్గాలు వాదిస్తున్నాయి. సమావేశంలో కేంద్ర కమిటీ ఈ అంశంపై లోతుగా చర్చించి పార్టీ మహాసభల కోసం ఒక రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని రూపొందిస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపైనా సమావేశం చర్చిస్తుందని ఆ వర్గాలు తెలిపారు. సిపిఎం పార్టీ 23వ జాతీయ మహాసభ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కేరళలోని కన్నూర్‌లో జరుగుతాయి.
సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
- Advertisement -