తేల్చి చెప్పిన కృష్ణానది
యాజమాన్య బోర్డు
71 :29నిష్పత్తిలో
పంచాలని తెలంగాణ
డిమాండ్ వీలుకాని
పక్షంలో 50:50
నిష్పత్తిలో పంచాలని
విజ్ఞప్తి అభ్యంతరం
చెప్పిన ఎపి ప్రతినిధులు
11 ప్రాంతాల్లో టెలీమెట్రీ
ఏర్పాటు చేయాలని
తెలంగాణ ప్రతిపాదన
మన తెలంగాణ/హైదరాబాద్: నదీ జలాలవాటాలకు సంబంధించి ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ వెల్లడించారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం సో మవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ము ఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఇంజినీర్లు, ఇరు రాష్ట్రాల ఉ న్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నా రు. ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బో ర్డు నిర్వహణపై ఈ భేటీలో చర్చించారు. మొత్తం 29 అంశాలతో కూడిన అంశాలపై కీలక చర్చలు జరిగాయి. రెండు తెలుగు రా ష్ట్రాల మధ్య కృష్ణానదీ నీటి వాటాల పం పిణీ, బోర్డు నిర్వహణ, బడ్జెట్, రాష్ట్రాల నుంచి నిధులు, టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, బోర్డు కార్యాలయం తరలింపు, ప్రాజెక్టుల స్వాధీనం సహా ఇతర అంశాలపై ప్రధానం గా కీలక చర్చలు జరిగాయి. టెలిమెట్రిక్ స్టే షన్ల ఏర్పాటుపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాల పై సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ స మావేశంలో కృష్ణా నదీ జలాల మళ్లింపు మీ ద సుదీర్ఘ
చర్చ జరిగింది. 66:34 వాటాలను అప్పట్లో ఒక్క సంవత్సరం కోసమే ఒప్పుకున్నారని, 71:29 వాటాలను కేటాయించాలనినేది తెలంగాణ హక్కు అని, అప్పటివరకు నదీ జలాల వాటాలను 50:50 ఇవ్వాలని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు కోరారు. తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు ఛైర్మెన్ ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఔట్ బేసిన్ మళ్లింపు ఎంత మేర వెళ్తున్నాయి తెలియాలని కోరారు. అలాగే రెండు రాష్ట్రాల అభ్యంతరాలను ఈ సమావేశంలో అధికారులు చర్చించారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సంబంధిత అంశాలను ప్రతిపాదించాయి. నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ, టెయిల్ పాండ్ లోని నాలుగు టీఎంసీల నీటి వినియోగం. శ్రీశైలం ప్లంజ్ పూల్‌కు మరమ్మత్తులు, ఆర్డీఎస్ ఆధునీకరణ, జల విద్యుత్ ఉత్పత్తి, సాగర్ ఎడమ కాలువ నష్టాలు, క్రాస్ లెవెల్స్ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు : ప్రాజెక్టులను అనుమతుల్లేకుండా నిర్మిస్తున్నారంటూ రెండు రాష్ట్రాలు చేసిన ఫిర్యాదులు, అభ్యంతరాలపై కూడా చర్చలో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల, శ్రీశైలం కుడి కాలువ, ఆర్డీఎస్ కుడి కాలువ సహా ఇతర ప్రాజెక్టులపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పాలమూరు -రంగారెడ్డి, నారాయణపేట – కొడంగల్, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలతో పాటు కల్వకుర్తి సామర్థ్యం పెంపు సహా జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వం తరపున అధికారులు అభ్యంతరాలను లేవనెత్తారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే, మరో సభ్యుడు శంఖుహ ఇతర ఇంజినీర్లు పాల్గొన్నారు.
తెలంగాణకు 71 శాతం వాటా ఇవ్వాలి : నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదరి రాహుల్ బొజ్జ
కృష్ణా జలాల్లో 66:34 నిష్పత్తిపై నిరసన తెలిపామని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతం 71 శాతం ఉందని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా ఇవ్వాలని, 71 శాతం ఖరారు చేసే వరకు చెరి సగం వాటా ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం 66:34 నిష్పత్తి ప్రకారం కొనసాగిస్తామని బోర్డు ఛైర్మన్ తెలిపారని, పరిస్థితులను బట్టి వాటా పెంచే ప్రయత్నం చేస్తామని ఛైర్మన్ చెప్పారని వివరించారు. జలాల మళ్లింపు విషయాన్ని సమావేశంలో ప్రస్తావించామని, 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కోరామని, టెలిమెట్రీల ఏర్పాటుపై వారంలో స్పందిస్తామని ఏపీ ఈఎన్సీ తెలిపారని రాహుల్ బొజ్జ తెలిపారు.
సాగర్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు ఉపసంహరించాలి : తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్
నాగార్జునసాగర్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని కోరినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ తెలిపారు. అలాగే సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల అంశాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు. డ్యామ్ స్లూయీజ్‌కు అవసరమైన మరమ్మతులు చేస్తామని కేఆర్ఎంబీ ఛైర్మన్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
50:50 నిష్పత్తిని అంగీకరించబోమని బోర్డుకు చెప్పాం : ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు
ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ అడిగిన 50:50 నిష్పత్తిని అంగీకరించబోమని బోర్డుకు చెప్పామని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. 66:34 నిష్పత్తి ప్రకారమే కొనసాగించాలని కోరామని, అదే నిష్పత్తి కొనసాగిస్తూ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని బోర్డు ఛైర్మన్ చెప్పారని అన్నారు. టెలిమెట్రీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదిత వివరాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థతో మోడల్ స్టడీస్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మోడల్ స్టడీస్ ఫలితాలు వచ్చేవరకు వచ్చే సీజన్‌కు అవసరమయ్యే అత్యవసర మరమ్మతులు చేపడతామని వెంకటేశ్వరరావు తెలిపారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీలోని విజయవాడకు తరలించాలని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర రావు కోరారు. హైదరాబాద్‌లో ఇస్తున్నట్లుగానే అక్కడ కూడా ఉచితంగా కార్యాలయానికి ఉచిత వసతి ఇవ్వాలని బోర్డు ఛైర్మన్ సూచించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానున్నట్లు ఏపీ ఈఎన్సీ తెలిపారు.