Wednesday, January 22, 2025

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది. 2018లో నమోదైన ఎక్సైజ్ కేసులను నాంపల్లి కోర్టు గురువారం కొట్టేసింది. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో ఎనిమిది డ్రగ్స్ కేసుల్లో ఆరు కేసులను కోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ కేసులో సరైన ప్రొసీజర్ పాటించేలదని కోర్టు తెలిపింది. టాలీవుడ్ డ్రగ్స్ అంశంలో సిట్ 8 కేసులు నమోదు చేసింది. ఎక్సైజ్ శాఖ నెలల తరబడి టాలీవుడ్ నటులను విచారించింది. పలువురి నుంచి గోర్లు, వెంట్రుకలు సేకరించింది. శాంపిల్స్ ను సేకరించిన ఎక్సైజ్ శాఖ ఎఫ్ఎస్ఎల్ కు పంపించింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక, సాక్ష్యాలను చూసి ధర్మాసనం కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News