Wednesday, January 22, 2025

అంతర్జాతీయంగా తగ్గుతున్న చమురు ధరలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం సైతం చమురు ధరలు తగ్గాయి. యూఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.1శాతం తగ్గి 66.90డాలర్ల వద్ద ట్రేడవుతుండగా బ్రెంట్ కాంట్రాక్టు తగ్గి 73.11డాలర్లుకు చేరుకుంది. ఈ రెండు బెంచ్‌మార్క్‌లు వారంలో 11శాతంపైగా తగ్గాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఇదే అతిపెద్ద తగ్గుదలగా నమోదైంది. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గలేదు. మరోవైపు రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. రికార్డుస్థాయిలో చమురు దిగుమతైంది.

గత నెలలో రోజుకు సగటున 1.6మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ రష్యా నుంచి దిగుమతైంది. సౌది అరేబియా, ఇరాక్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న కంటే కావడం గమనార్హం. రష్యా రాయితీతో చమురు అమ్ముతుండటంతో భారత్ రష్యానుంచే ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాయి. రష్యా భారీ డిస్కౌంట్‌తో చమురును విక్రయిస్తోంది. కాగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. కాగా రష్యా ధరలు తగ్గించి చమురును సరఫరా చేయడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా చమురు ధరలు తగ్గినా మనదేశంలో పెట్రోధరలు స్థిరంగా కొనసాగతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News