- Advertisement -
ఛండీగఢ్: హర్యానా రాష్ట్రం ఫతేహాబాద్ జిల్లాలో ప్రమాదం జరిగింది. సర్దారెవాలా గ్రామ శివారులో భాఖడా కాలువలోకి జీపు దూసుకెళ్లడంతో 9 మంది మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదు మంది మహిళలు, 11 ఏళ్ల చిన్నారి ఉన్నారు. మృతులు మెహమరా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వెలుతురు తక్కవగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -