Thursday, November 14, 2024

క్రిప్టోకరెన్సీని ఆస్తివర్గంగా గుర్తించి నియంత్రించే చట్టం తేవాలి

- Advertisement -
- Advertisement -

Crypto transactions should be recognised as asset class

లావాదేవీల డేటా దేశీయ సర్వర్లలో ఉండాలి
కేంద్రానికి స్వదేశీ జాగరణ్‌మంచ్ సూచన

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ఆస్తివర్గంగా గుర్తించి, ప్రభుత్వ నియంత్రణలో ఉంచేందుకు ఓ చట్టాన్ని తేవాలని కేంద్రానికి ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌మంచ్(ఎస్‌జెఎం) సూచించింది. లావాదేవీల ప్రక్రియకు సంబంధించిన డేటా, హార్డ్‌వేర్ దేశీయ సర్వర్లలో ఉండాలని ఎస్‌జెఎం కోకన్వీనర్ అశ్వనీమహాజన్ తెలిపారు. ఆ విధంగా చేయడం వల్ల చట్టవిరుద్ధ లావాదేవీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి వీలవుతుందన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు నడిపే ఎక్ఛేంజీల ద్వారా ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా ఎవరైనా పెట్టుబడులు పెట్టే అవకాశమున్నదన్నారు. అయితే, ఏ ప్రభుత్వమూ క్రిప్టో కరెన్సీపై ఇప్పటివరకూ నియంత్రణ కలిగి లేకపోవడం ఓ లోపమని మహాజన్ గుర్తు చేశారు. నిక్షిప్తమైన లావాదేవీలను ప్రైవేట్ ఎక్ఛేంజీల ద్వారా నడిపేందుకు ఓ యంత్రాంగం కూడా లేదన్నారు. దాంతో, పెట్టుబడులు పెడుతున్నదెవరు, పెట్టుబడులతో ఏంచేస్తున్నారో తెలియనిస్థితి నెలకొన్నదన్నారు. ఆయుధాల కొనుగోలు, డ్రగ్స్ వ్యాపారంలాంటివి కూడా క్రిప్టో ద్వారా నిర్వహిస్తున్న ఉదంతాలు వెలుగు చూశాయని మహాజన్ తెలిపారు.

క్రిప్టో ఆస్తుల్ని బంగారంలాంటి ఇతర వస్తువులతో పోల్చడాన్ని ఆయన తిరస్కరించారు. క్రిప్టోకు ఆంతరంగిక విలువ లేదన్నారు. డబ్బుతో సమానమైన లావాదేవీలు నడిపే అధికారాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఏ సార్వభౌమ దేశమూ ఇవ్వదని మహాజన్ అన్నారు. క్రిప్టోకరెన్సీపై జాతీయస్థాయిలో విస్తృత చర్చ జరగాల్సి ఉన్నదన్నారు. క్రిప్టో కరెన్సీ అనే పదం మొదటిసారిగా 2008లో బిట్‌కాయిన్‌ను ప్రారంభించడంతో వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు భారత్‌సహా పలు దేశాల్లో వందలాది క్రిప్టో కరెన్సీలు వాడుకలోకి వచ్చాయి. దశాబ్దకాలంగా బిట్‌కాయిన్‌కు విస్తృత మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాతి స్థానాల్లో సొలానా, ఎథీరియమ్‌లున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News