Sunday, December 22, 2024

క్రిప్టోకరెన్సీ జిఎస్‌టి ఎగవేత మొత్తం రూ. 95.86 కోట్లు వసూలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 11 క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జిఎస్‌టి) ఎగవేతకు సంబంధించి రూ.95.86 కోట్లను రాబట్టుకోగలిగినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఈమొత్తంలో జరిమానా, వడ్డీ కూడా ఇమిడి ఉందని పేర్కొంది. జిఎస్‌టి ఎగవేత కేసుల్లో జన్‌మాయి లాబ్స్, కాయిన్ డిసిఎక్స్, కాయిన్ స్విచ్ కూబెర్, బై యు కాయిన్, యూనోకాయిన్ సంస్థల లావాదేవీలు ఉన్నాయి. ఇవికాక జెబ్ ఐటి సర్వీసెస్, సెక్యూర్ బిట్ కాయిన్ ట్రేడర్స్, జియోటస్ టెక్నాలజీస్, ఆలెంకన్ ఇన్నొవేషన్స్ ఇండియా(జెబ్‌పే), డిసీడియమ్ ఇంటర్నెట్ ల్యాబ్స్ ఈ కేసుల్లో ఉన్నాయి. ఈ సంస్థల జిఎస్‌టి ఎగవేత మొత్తం రూ.81.54 కోట్లని కనుగొనగా, వడ్డీ, జరిమానాలతో కలిపి రూ. 95.86 కోట్లు వసూలు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. జన్‌మాయి ల్యాబ్స్ నుంచి రూ.49.18 కోట్లు, కాయిన్ డిసిఎక్స్ నుంచి రూ.17.1కోట్లు కాయిన్ స్విచ్ కూబెర్ నుంచి రూ.16.07 కోట్లు రాబట్టినట్టు ప్రభుత్వం ఒక సమాధానంలో వివరించింది.

Cryptocurrency GST Evasion Received Rs.95.86 cr

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News