న్యూఢిల్లీ : ఆగ్రోకెమికల్ కంపెనీ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ నూతన ఫంగిసైడ్ ‘మెంటార్’ను వరి రైతుల కోసం విడుదల చేసింది. వరిలో కనిపించే తెగుళ్లు వంటి వాటిని నియంత్రించడంతో పాటుగా వరి పంటకు అదనపు రక్షణ అందించి అధిక దిగుబడిని అందిస్తుంది. మెంటార్‌ను పలు రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయాలలో పరీక్షించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో 1000కు పైగా డెమాన్‌స్ట్రేషన్‌లను రైతులతో కలిసి పలు మార్కెట్‌లలో చేశారు.
వరిలో సాధారణంగా కనిపించే తెగుళ్ల నియంత్రణకు ఇది తోడ్పడటంతో పాటుగా రైతులకు అత్యంత ప్రయోజనకారిగా ఇది నిలిచింది. ఆర్ అండ్ డి ఆధారిత ఉత్పత్తి మెంటార్‌ను విడుదలచేయడం పట్ల సంతోషంగా ఉన్నామని, ఇది అత్యంత శక్తివంతమైన ఫంగిసైడ్, ఇది రైతులకు అధిక లాభాలను అందించనుందని క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజిక్ మార్కెటింగ్) సిఎస్ శుక్లా అన్నారు.