Sunday, January 19, 2025

స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రసిద్ధ అగ్రోకెమికల్ సంస్థ అయిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, వ్యవసాయ విద్యాభివృద్ధికి మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తన నిబద్ధతను ప్రకటించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (NAAS) సహకారంతో, ఈ బ్రాండ్ వ్యవసాయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రెసివ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అంకుర్ అగర్వాల్ యొక్క దివంగత తల్లి కనక్ అగర్వాల్ గౌరవార్థం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.

ఈ ప్రత్యేక కార్యక్రమం వ్యవసాయ రంగంలో మార్పు తీసుకురావాలనే మక్కువతో ఉన్న యువతులకు ఆర్థిక సహాయం, అవకాశాలను అందించడం ద్వారా తదుపరి తరం విద్యార్థుల ఆకాంక్షలను తీర్చనుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ సంవత్సరానికి 21 మంది బాలికల చొప్పున ప్రతి సంవత్సరం మొత్తం 84 స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.

“క్రిస్టల్ క్రాప్‌ వద్ద మేము భారతదేశ వ్యవసాయరంగంలో మహిళలు పోషించే కీలక పాత్రను మేము ఎంతో గౌరవిస్తాము. ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమ ప్రారంభంతో, బాలికల విద్య కోసం నిష్కపటం గా ప్రయత్నించిన మా తల్లికి మేము నివాళులర్పిస్తున్నాము, ఈ వర్ధమాన ప్రతిభావంతులను అవసరమైన మద్దతు అందించటం ద్వారా వారు విద్యాపరంగా రాణించడమే కాకుండా కెరీర్‌ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా కూడా ముందుకు సాగాలని మేము భావిస్తున్నాము” అని క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అంకుర్ అగర్వాల్ అన్నారు.

ఈ కార్యక్రమం జూలై/ఆగస్టు, 2024లో జరగబోయే సెషన్ నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తుదారులు మరింత సమాచారాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ & క్రిస్టల్ క్రాప్ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.

“ఈ ఉదాత్తమైన కార్యక్రమం ద్వారా, మేము విద్యార్థుల భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడమే కాకుండా మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాము” అని డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News