Monday, December 23, 2024

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనకు సంబంధించి సంబంధిత శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రధాని పర్యటనకు సంబంధిత ఏర్పాట్లపై ఆమె అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రామగుండం ఎన్‌టిపిసి 800 మెగావాట్ల ప్రాజెక్టును వర్చువల్‌గా ఆదివారం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అగ్నిమాపక, ఆరోగ్య, విద్యుత్, రోడ్లు భవనాలు తదితర శాఖలు కూడా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు నిజామాబాద్ కలెక్టర్, సి. పి. సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డిజిపి అంజనీకుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, అదనపు డిజి స్వాతి లక్రా, జిఎడి కార్యదర్శి శేషాద్రి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, అగ్నిమాపక శాఖ డిజి నాగిరెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, పోలీస్, ఎన్.టి.పి.సి, బిఎస్‌ఎన్‌ఎల్, అగ్నిమాపక, విమానయాన శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News