- Advertisement -
హైదరాబాద్: ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ రోజు బిఆర్ కెఆర్ భవన్‌లో సీనియర్ మున్సిపల్ అధికారులు, రక్షణ అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలోని మిలటరీ ప్రాంతం గుండా వెళుతున్న బల్కాపూర్ నాలాకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. టోలీచౌకిలోని నదీం కాలనీ, ఇతర ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నందున మిలటరీ ప్రాంతంలో ఉన్న చెక్‌డ్యామ్‌ను తొలగించి పైప్‌లైన్ వేయాలని అధికారులను ప్రధాన కార్యదర్శి సూచించారు. బల్కాపూర్ నాలా నుంచి రేతి బౌలి వరకు, మూసీ చివరి వరకు జీహెచ్‌ఎంసీ, ఆర్మీ అధికారులతో సంయుక్తగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మిలటరీ ప్రాంతం నుండి టోలీచౌకి వైపు తుఫాను నీటి కాలువను మళ్లించే అవకాశాలను పరిశీలించాలని ఆయన అధికారులను కోరారు.
- Advertisement -