Wednesday, January 22, 2025

ఖజానాకు ఆదాయాన్ని పెంచండి: అధికారులకు సిఎస్ ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై కొత్తగా ఎలాంటి పన్నులు విధించే పరిస్థితులు లేవని, ప్రస్తుతం అమలులో ఉన్న పన్నుల విధానంతో ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. పన్ను వసూళ్ళను పెంచేందుకు అవసరమైతే ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది లక్షాల సాధనపై దృష్టి సారించాలని కోరారు.

సిఎస్ శాంతి కుమారి బుధవారం బిఆర్‌కె భవన్‌లో అధికారులతో రాష్ట్రాల పన్నులు, పన్నుయేతర ఆదాయాల సాధించిన పురోగతిని సమీక్షించారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్, రవాణా, మైనింగ్ తదితర శాఖల అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిఎస్ మాట్లాడుతూ ప్రతి వారం సమీక్షలు నిర్వహించి లక్షాలను చేరుకోవాలని సూచించారు.

ఆదాయాన్ని ఆర్జించే శాఖలైన కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, రవాణా శాఖలు అదనపు ఆదాయాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించాలని కోరారు. ఈ సంవత్సరం జనవరి నాటికి పన్నుల వసూళ్ళలో రూ.91,145 కోట్లు, పన్ను యేతర ఆదాయంలో రూ.6,996 కోట్లు, మొత్తం 98,141 కోట్ల ఆదాయం సమకూరిందని సిఎస్ వెల్లడించారు. కమిషనర్ ఇన్‌స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రాహుల్ బొజ్జా, కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ నీతూ కుమారి ప్రసాద్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరి రోనాల్డ్ రోస్, డైరెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్ఫరాజ్ అహ్మద్, రవాణా శాఖ కమిషనర్ బుద్ద ప్రకాష్ జ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News