Tuesday, November 5, 2024

సిఎస్ ఆకస్మిక సెలవు ఆంతర్యం ఏమిటి?

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వ్యవహారశైలి ఐఎఎస్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆకస్మికంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సిఎస్ మరొకరికి ‘ఫుల్ అడిషనల్ చార్జి’(ఎఫ్‌ఎసి) ఇవ్వకుండానే అమెరికా వెళ్లడంపై ఆ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఐఏఎస్‌ల కు అధిపతిగా ఉన్న సిఎస్ ఇలా వ్యవహరించడం ఏంటన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వసాధారణంగా సిఎస్ విదేశాలకు వెళ్లినప్పుడు మ రో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఇన్‌చార్జ్జి బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది. అయితే అలాంటిదేమీ లేదని, ఎవరికీ లేని నిబంధనలు ఈ ఉన్నతాధికారికి ఎలా వర్తిస్తాయని ఐఏఎస్‌లు ప్రశ్నిస్తున్నా రు. ఈనెల 7 లేదా 8 తేదీల్లో శాంతి కుమారి తిరిగి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని, అప్పటివరకు భారీగా ఫైళ్లు పేరుకుపోతాయని, తద్వారా రాష్ట్రానికి సంబంధించిన పాలనవ్యవస్థపై ప్రభావం ప డుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ని బంధనలు అందరికీ ఒకే మాదిరిగా ఉండాలని పలువురు ఐఏఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. కిందిస్థాయి ఐఏఎస్‌లు, అధికారులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకునే ఉన్నతాధికారే ఇలా నిబంధనలు అతిక్రమిస్తే మిగతా ఐఏఎస్‌ల్లో చులకనభావం నెలకొంటుందని వారు పేర్కొంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, ప్రస్తుతం మాత్రం తాము ఈ ఉన్నతాధికారి అపాయింట్‌మెంట్ కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తా ము నిర్వర్తించే శాఖలకు సంబంధించి ఆ ఉన్నతాధికారి సంతకాల కోసం రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తోందని పలువురు అధికారులు వాపోతున్నారు. ఇదిలావుండగా గత ప్రభుత్వం మారి కాం గ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ సిఎస్‌గా శాంతి కుమారినే సిఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న పాలనా పరమైన కీలక నిర్ణయాల అమలులో సిఎస్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని, దీనిపై ముఖ్యమంత్రి గుర్రుగా ఉన్నారని కూడా ఐఎఎస్ వర్గాల్లో మరో చర్చ సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News