Sunday, January 19, 2025

బల్కంపేట్ అమ్మవారిని దర్శించుకున్న సిఎస్

- Advertisement -
- Advertisement -

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శాంత కుమారి చండీ హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం వ్యాపారవేత్త యుగంధర్, రజని దంపతులు 2.5 కిలోల బంగారంతో చేయించిన కవఛాన్ని అమ్మవారికి సమర్పించారు.

వేద మంత్రాలతో ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆశీర్వచనాలతో పాటు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా ఈ నెల 20న ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా సమర్పించే చీర మగ్గంపై తయారీ పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈఓ అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News