Sunday, January 19, 2025

విశ్రాంత ఐఎఎస్ అధికారులతో సిఎస్ శాంతికుమారి

- Advertisement -
- Advertisement -

అద్భుతం… అభినందనీయం
సచివాలయ భవనాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన విశ్రాంత ఐఎఎస్ అధికారులు

మనతెలంగాణ/ హైదరాబాద్: కొద్ది సమయంలో అద్భుతంగా న భూతో నభవిష్యతి అనే విధంగా సచివాలయ నిర్మాణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. రాష్ట్రంలో వివిధ హోదాలో సేవలందించిన విశ్రాంత ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు శనివారం సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తే నీటి విందును ఆమె ఇచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 1970 నుంచి ఇటీవలి కాలం వరకు పదవీ విరమణ పొందిన ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు పెద్ద సంఖ్యలో తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. విశ్రాంత అధికారులు ఎ.కె.కుట్టి, సుజాతరావు, వి.పి.జవహరి, పి.సి.పరేఖ్, కె.వి.రావు, రాజీవ్ శర్మ, ఎస్.కె.జోషి, జై భరత్ రెడ్డి, రస్తోగి, మిన్ని మాథ్యూస్, ఎ.కె. గోయల్, దినకర్‌బాబు, జి.సుధీర్, టి.ఎస్.అప్పారావు, జి.నాగిరెడ్డి, రేమండ్ పీటర్‌లు ఉన్నారు.

ముందుగా సచివాలయం ఎదుట గ్రూప్ ఫోటో దిగిన అనంతరం విశ్రాంత అధికారులు కొత్తగా నిర్మించిన దేవాలయం, మసీద్, చర్చిలను సందర్శించారు. అనంతరం సచివాలయంలోని 6వ అంతస్తు తోపాటు వివిధ ఫ్లోర్ లను తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అతి తక్కువ సమయంలో అద్భుతంగా న భూతో నభవిష్యతి అనే విధంగా సచివాలయ నిర్మాణాన్ని చేసిన విధానం, ఇందులోని ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను, యాదాద్రి ఆలయ ప్రసాదాలను అధికారులకు అందజేశారు.

నూతన సచివాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని, రాష్ట్రంలో జరుగుతున్న అప్రతిహత అభివృద్ధిని అధికారులు ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ప్రశంసించారు. సంక్షేమ, అభివృద్ది రంగాలలో రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో నిలవడం తెలంగాణ ప్రజానీకానికి గర్వకారణం అని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లలో సాధించిన రాష్ట్ర ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ కె.అశోక్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై వీడియో రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News