Saturday, November 23, 2024

ప్రభుత్వ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
అన్ని జిల్లాల కలెక్టర్‌లతో సిఎస్ సమీక్ష

 

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సిఎస్ సోమేష్‌కుమార్ ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సిఎస్ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు (యూఎల్‌బి)లతో బుధవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిఓ నెం.58, 59దరఖాస్తుల ప్రొసిడింగ్స్, అన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల గ్రౌండింగ్, తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణాల నిర్మాణం, బహుళస్థాయి అవెన్యూ ప్లాంటేషన్లు, బ్లాక్ ప్లాంటేషన్లు, వరి సేకరణ, దళితబంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ సిఐజి శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, అటవీ శాఖ పిసిసిఎఫ్ డోబ్రియల్, టిఎస్‌ఐఐసి ఎండి నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News