కారుణ్య నియామకాల్లో జాప్యం ఎంతమాత్రం తగదు
అన్ని శాఖల అధికారులకు సిఎస్ సోమేష్‌కుమార్ గట్టి ఆదేశాలు
సెక్రటేరియెట్, హెచ్‌ఒడి, జిల్లా స్థాయి ఉద్యోగుల పదోన్నతులు తక్షణమే జరపాలి
ప్రమోషన్ల వల్ల ఏర్పడే ఖాళీలను నియామకాల నోటిఫికేషన్లలో చేర్చాలి
ప్రతి బుధవారం పురోగతిని సమీక్షించే సమావేశాలు జరపాలి
వివిధ శాఖల అధిపతులతో సమావేశంలో సిఎస్
మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు సెక్రటేరీయట్, హెచ్ఓడి, జిల్లా స్థాయిలో ఉద్యోగుల పదోన్నతుల్లో ఎటువంటి జాప్యం లేకుండా జనవరి 31వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అన్ని శాఖల కార్యదర్శులను, హెచ్‌ఓడిలను ఆదేశించారు. సోమవారం బిఆర్‌ఆర్‌కె భవన్‌లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రమోషన్‌లతో పాటు కారుణ్య నియామకాల ప్రక్రియలో ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సిఎస్ సూచించారు. ప్రమోషన్లు ఇవ్వడం వలన ఏర్పడే ఖాళీలను ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్‌లలో చేర్చాలని ఆయన సూచించారు. ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల భర్తీ అంశాలపై ప్రతి వారంలో బుధవారం(జనవరి 06,20,27వ తేదీల్లో) సమావేశాలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. సిఎం కెసిఆర్ విజన్ ప్రకారం అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌ఓడిలు ఈ అంశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజీవ్‌శర్మ, అనురాగ్‌శర్మ, కెవి రమణాచారి, ఎకె ఖాన్, ఎస్‌కె జోషిలతో పాటు డిజిపి మహేందర్‌రెడ్డి, పోలీసు అధికారులు పూర్ణచందర్‌రావు, గోపీకృష్ణ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, సురేష్‌చందా, అధర్‌సిన్హా, ముఖ్య కార్యదర్శులు రజత్‌కుమార్, అర్వింద్‌కుమార్, రామకృష్ణారావు, సునీల్‌శర్మ, జయేశ్‌రంజన్, రవిగుప్తా, హర్‌ప్రీత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
CS Somesh kumar for promotions Completion by month end