Thursday, December 19, 2024

అత్యుత్తమ సేవ కేంద్రాలుగా వార్డు కార్యాలయాలు: సిఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అత్యుత్తమ సేవ కేంద్రాలుగా వార్డు కార్యాలయాలు పని చేయనున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధ వేడుకల్లో భాగంగా శుక్రవారం అమీర్‌పేట వార్డు కార్యాలయాలన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి శాంత కుమారి పారిశుధ్య కార్మికుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థలతోపాటు జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో శుక్రవారం పట్టణ ప్రగతిని ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పట్టణాభివృద్ధిలో గత తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తు చేసకుంటే పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించకున్నట్లు తెలిపారు. వేగవంతమైన పట్టణీకరణతో స్థానిక ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల అవసరం ఎంతైన ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, పట్టణ పచ్చదనాన్ని పెంపొందించడం, సురక్షితమైన తాగునీటిని అందించడంలాంటి ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అదేవిధంగా వికేంద్రీకృత పరిపాలన ఆవశ్యకతపై ప్రభుత్వం దృష్టి సారించిందని, దాని ఫలితంగా వార్డు కార్యాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

వార్డులోని సీనియర్ సిటిజన్‌లు స్వచ్ఛందంగా వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టడం పట్ల పధాన కార్యదర్శి వారికి అభినందనలను తెలిపారు. వయో వృద్ధులను చూసి యువత స్ఫూర్తి పొంది సమాజాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సత్కరించిన శాంత కుమారి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. జోనల్ కమిషనర్ రవికిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News