హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు శుక్రవారం ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో ఇంటింటి ఫీవర్ సర్వేను అధికారులు ప్రారంభించారు. ఇందులో భాగంగా నగరంలోని ఖైరతాబాద్ సర్కిల్ హిల్ టాప్ కాలనీలో జరుగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆకస్మిక తనికీ చేశారు. ఈ తనిఖీలో సిఎస్ తోపాటు జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ పాల్గొన్నారు. కాగా, ఈ ఇంటింటి ఫీవర్ సర్వేలో ఒక్కొక్క టీమ్ లో ఆశా, ఏ.ఎన్.ఎం, మున్సిపల్, పంచాయితీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బ దులతో ఉన్నారా పరిశీలించి, ఒకవేళ కవిడ్ లక్షణాలుంటే మెడికల్ కిట్ ను అందచేస్తారు. ఈ డోర్ టు డోర్ సర్వేలో ప్రాధమికంగా గుర్తించిన వారికి 5 రోజుల పాటు సరిపడే మందుల కిట్ ను అందచేస్తున్నామని, ఒక కోటి మందుల కిట్ లను సిద్ధంగా ఉంచామని సిఎస్ అన్నారు.
CS Somesh Kumar inspects Fever Survey at Khairatabad