Saturday, November 23, 2024

ధరణి సమస్యలపై వాట్సప్, ఈ-మెయిల్‌లో ఫిర్యాదు చేయండి

- Advertisement -
- Advertisement -

ధరణి సమస్యలపై వాట్సప్, ఈ-మెయిల్‌లో ఫిర్యాదు చేయండి
త్వరితగతిన పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో కమిటీ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడానికి వాట్సప్, ఈ- మెయిల్‌లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. విజ్ఞప్తులను పంపేందుకు వాట్సప్, ఈ-మెయిల్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన చీఫ్ కమిషనర్(సిసిఎల్‌ఏ) సోమేశ్ కుమార్ తెలిపారు. విజ్ఞప్తులను పంపాల్సిన వారు వాట్సప్ నంబర్ 9133089444, Ascmro@ Telangana.gov.inకు మెయిల్ చేయాలని ఆయన సూచించారు. త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని, సిసిఎల్‌ఏ, రిజిస్ట్రేషన్లు, ఐటి విభాగాల అధికారులను సభ్యులుగా నియమించామని సిఎస్ వెల్లడించారు.

CS Somesh Kumar meeting on Dharani Portal Issues

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News