Friday, November 22, 2024

నూతన చట్టాలను నిబద్ధతతో అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -
CS Somesh Kumar meeting with officials of local bodies
అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్

హైదరాబాద్ : నూతనంగా తీసుకొచ్చిన మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాన్ని సంబంధిత అధికారులు నిబద్ధతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ సీనియర్ అధికారులతో పల్లె, పట్టణ ప్రగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను గ్రామపం చాయతీలు, మున్సిపాలిటీలలో అంకిత భావంతో అమలు చేయలన్నారు. ఈ చట్టాల అమలు కోసమే ప్రత్యేకంగా అదనపు కలెక్టర్ పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. సిఎం కెసిఆర్ విజన్‌ను గుర్తుచేస్తూ ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలను శుభ్రంగా, పచ్చదనంగా ఉంచాలన్నారు. గ్రామపంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు ప్రతి నెల రెగ్యులర్‌గా రూ.456 కోట్లను విడుదలతో పాటు ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇవ్వడంతో ఎటువంటి సమస్యలు లేవన్నారు. అడిషనల్ కలెక్టర్లు గ్రామపంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలను తనిఖీ చేసి ప్రతి రోజు రహదారులను, డ్రైన్లను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని ఆదేశించారు. విధులలో నిర్లక్ష్యం వహించిన వారిపై తగు చర్యలు ఉంటాయన్నారు. స్థానిక సంస్థలలో వైకుంఠధామాలు, సెగ్రిగేషన్, డంపింగ్ షెడ్స్, సమీకృత వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మార్కెట్లు లాంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినందున వీటిని మార్చిలోగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు.

పచ్చదనం కోసం చేపట్టిన పల్లె ప్రకృతి వనం తరహాలో ట్రీ పారక్స్ , మల్టీ లెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి పూర్తి చేయాలన్నారు. నూతన చట్టం ప్రకారం బడ్జెట్ లో 10 శాతాన్ని గ్రీన్ బడ్జెట్ గా వినియోగించాలన్నారు. దెబ్బతిన్న మొక్కలను వెంటనే రీప్లేస్ చేయాలన్నారు. వేసవి సీజన్ లో మొక్కలు బతికేలా గ్రామ పంచాయతీలలో ఉన్న ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవన నిర్మాణ అనుమతులు జారీ చేయడం కోసం టిఎస్ బిపాస్‌ను అమలులోకి తీసుకోవచ్చామన్నారు. భవన నిర్మాణ అనుమతులు వేగంగా జారీ తో పాటు ఎటువంటి ఆక్రమణలు లేకుండా చూడాలని అడిషనల్ కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్ రోస్, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ రఘునందన్ రావు, పిసిసిఎఫ్ శోభ, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సిడిఎంఎ ఎన్ సత్యనారాయణ , సియండి. టిఎస్‌పిడిసిఎల్ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News