Sunday, January 19, 2025

గాంధీ సినిమా ప్రదర్శనపై ఇతర రాష్ట్రాల ఆసక్తి: సిఎస్

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar planted saplings in Freedom Park

ఫ్రీడమ్ పార్క్ లో మొక్కలు నాటిన సిఎస్

హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మాదాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ లో ప్రదర్శిస్తున్న గాంధీ చలన చిత్రాన్ని వీక్షిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులతో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ కలసి ముచ్చటించారు. సిఎస్ తోపాటు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవీగుప్త, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రలు కూడా ఉన్నారు. గాంధీ సినిమా ఇదివరకు చూసారా, ప్రస్తుతం చూస్తే ఎలా అనిపించింది తదితర ప్రశ్నలను వారిని అడిగారు. ఇప్పటి వరకు తాము గాంధీ సినిమా చూడలేదని, ఈ సినిమా వీక్షణం ద్వారా భారత స్వతంత్ర పోరాటం గురించి పూర్తిస్థాయిలో మరోసారి అవగాహన ఏర్పడిందని విద్యార్థులు సిఎస్ కు తెలిపారు. సినిమా చూసిన తర్వాత తిరిగి పాఠశాలకు వెళ్లిన అనంతరం, ఈ సినిమా చూడడం వల్ల ఏర్పడ్డ భావాలను, తమలో వచ్చిన మార్పుల గురించి సవివరమైన వ్యాసాన్ని రాయాలని సోమేశ్ కుమార్ సూచించారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా స్వాతంత్రోద్యమాన్ని తెలియచేసే గాంధీ సినిమాను తెలంగాణలో 552 సినిమా హాళ్లలో 22 లక్షలకు పైగా స్కూల్ విద్యార్థులు వీక్షిస్తున్నారని, అవసరమవుతే మరికాన్ని రోజులు ఈ సీనిమా ప్రదర్శనను పొడగిస్తామని తెలియచేసారు. ఈ సినిమా ను ప్రతీ ఒక్క విద్యార్థి చూసి స్వతంత్ర స్ఫూర్తి పొందాలనేది రాష్ట్ర ముఖ్యమంత్ర్రి కేసీఆర్ అభిమతమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లక్షలాది మంది విద్యార్థులకు గాంధీ సినిమా చూపించడంపై ఇతర రాష్ట్రాల అధికారులు ఆసక్తి చూపుతూ, ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో ఎలా చూపిస్తున్నారని వాకబు చేస్తున్నారని సోమేశ్ కుమార్ వెల్లడించారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని ఫ్రీడమ్ పార్క్ లో మొక్కలు నాటిన సిఎస్ సోమేశ్ కుమార్

భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్బంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో జీహెచ్ఎంసీ కొత్తగా రూపొందించిన ఫ్రీడమ్ పార్క్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మొక్కలు నాటారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ ఎంసీ కమీషర్ లోకేష్ కుమార్ లు కూడా ఈ సందర్బంగా ఫ్రీడమ్ పార్క్ లో మొక్కలు నాటారు. రోడ్ నెంబర్ 36 ప్రధాన రహదారి పై ఐదెకరాల స్థలంలో అద్భుతమైన పార్క్ ఏర్పాటుచేయడం పట్ల సంభందిత అధికారులను సోమేశ్ కుమార్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News