Monday, December 23, 2024

కొవిడ్ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -
CS Somesh kumar review on Covid-19
అందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలి
మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా కఠినంగా అమలు
ఉన్నతాధికారులతో సిఎస్ సోమేష్‌కుమార్
కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన
చర్యలపై సిఎస్ ఉన్నతస్థాయి సమావేశం

హైదరాబాద్ : అనేక రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ వేరియంట్ కేసులు, కొవిడ్-19 కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన నివారణ చర్యలు కూడా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు సిఎస్ సోమేష్ కుమార్ ఉన్నతాధికారులతో కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ పరిస్థితిని సమీక్షించారు. ఒమిక్రాన్, కొవిడ్ కేసుల వ్యాప్తి నేపధ్యంలో కొవిడ్ నిబంధనల మేరకు మతపరమైన, రాజకీయ, సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలతో సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని సిఎస్ అన్నారు.

ప్రజా రవాణాలో, దుకాణాలు, మాల్స్, సంస్థల నిర్వహణలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, కార్యాలయాలు, పాఠశాల ఆవరణలను తరచుగా శుభ్రం చేయడం, ఐఆర్ థర్మామీటర్,థర్మల్ స్కానర్, శానిటైజర్ సదుపాయలు ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించి కొవిడ్ నిబంధనలను పాటించేలా చూడాలని పాఠశాలలు, విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధించే ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని, సీనియర్ సిటిజన్లు, ధీర్ఘకాలిక వ్యాదులతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, డీహెచ్ శ్రీనివాసరావు, సిఎం ఒఎస్‌డి గంగాధర్, టీఎస్‌ఎండీసీ ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, డిఎంఇ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News