Monday, December 23, 2024

యాసంగి ధాన్యం కొనుగోలుపై సిఎస్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar Review on Grain Purchases

రాష్ట్రంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు. ఇప్పటికే 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఆర్కేఆర్ భవన్ లో జరిగిన ఈ సమావేశానికి పౌరసరఫరాల కమీషనర్ అనీల్ కుమార్, మార్కెటింగ్ శాఖ అధికారులు భాస్కర్,అరుణ్,రుక్మిణి, పద్మజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ…. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా ఏవిధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 61300 మంది రైతులనుండి 3679 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 .80 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మరో 8 కోట్ల గన్నీ బ్యాగుల కొనుగోలు టెండర్ల ప్రక్రియ నేడు పూర్తవుతుందని తెలిపారు.

వీటికితోడు మరో రెండున్నర కోట్ల గన్నీ బ్యాగులను జ్యుట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి త్వరలోనే అందుతాయని చెప్పారు. రాష్ట్రంలోని ధాన్యం కొనుగులో కేంద్రాలకు ఇతర రాష్ట్రాలనుండి అక్రమంగా ధాన్యం రాకుండా ఉండేందుకుగాను ఇతర రాష్ట్రాలనుండి సరిహద్దుగల 17 జిల్లాల సరిహద్దుల్లో 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వివరించారు. సేకరించిన ధాన్యం వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలని తద్వారా చెల్లింపులు త్వరితగతిన జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ధాన్యం సేకరణకు నిధుల సమస్యే లేదని ఇప్పటికే, రైతులకు చెల్లింపులు చేయడానికి రూ. 5000 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిందని సి.ఎస్. సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపడం జరుగుతుందని, నేటి వరకు 4 .3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపామని అన్నారు. వరంగల్. గద్వాల్, వనపర్తి, భూపాల్ పల్లి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వరి కోతలు ఆలస్యంగా అవుతాయని, వరి కోతలు ప్రారంభం కాగానే ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సిఎస్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News