Sunday, January 19, 2025

ఖాళీల భర్తీపై సిఎస్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

CS Somesh kumar review on job of vacancies

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ 80వేలకు పైగా కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటితో పాటు 11వేల మందికి పైగా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ముందుగా ఆయా శాఖల్లో ఖాళీల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో భర్తీకి సంబంధించి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కొన్నాళ్లుగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఆర్థిక, సాధారణ పరిపాలన, విద్య, వైద్య, హోం శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు, వాటి పరిస్థితిపై పూర్తి స్థాయిలో చర్చించారు. తుది సమాచారం. వివరాల ఆధారంగా ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలకు అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఆయా సంస్థలు నియామక ప్రక్రియను ప్రారంభించనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News