Thursday, November 14, 2024

ప్రధాని పర్యాటన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. గురువారం బిఆర్‌కెఆర్‌ భవన్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న రామగుండం ప్రధాని పర్యటనకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రామగుండం, హైదరాబాద్‌లో తగిన భద్రత, శాంతిభద్రతలు, బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను సిఎస్ ఆదేశించారు.

పెద్దపల్లి కలెక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ, సిపి రామగుండం ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, రామగుండం ఫర్టిలైజర్స్ సిఈవో ఏకే జైన్‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రధాని పర్యటన ఏర్పాట్లను సిఎస్ సమీక్షించారు. సమావేశంలో డిజిపి ఎం.మహేందర్‌రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, హోంశాఖ పిఆర్‌ఎల్ సెక్రటరీ రవిగుప్తా, సెక్రటరీ జిఎడి శేషాద్రి, టిఆర్ అండ్ బి సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజు, ఫైర్ సర్వీస్ డిజి సంజయ్‌కుమార్ జైన్, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News