Monday, December 23, 2024

రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు : సోమేశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar review on telangana formation day

హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధిత ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పరిశీలించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జరగనున్న ఈ వేడుకలకు సంబంధించి పూర్తి డ్రెస్ రిహార్సల్ పరేడ్‌ను మంగళవారం ఆయన వీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు జూన్ 2 న పబ్లిక్‌గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు చేరుకొని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి రిహార్సల్‌ను సోమేశ్ కుమార్ పరిశీలించారు. కోవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిఎస్ తెలిపారు. కార్యక్రమంలో డిజిపి మహేందర్‌రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సునీల్ శర్మ, పొలిటికల్ కార్యదర్శి శేషాద్రి, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, జలమండలి ఎండి దానకిషోర్, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ అధికారులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News